Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ఎఫెసీ పత్రిక - ఎఫెసీ పత్రిక 5

ఎఫెసీ పత్రిక 5:6-14

Help us?
Click on verse(s) to share them!
6పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
7కాబట్టి వారికి దూరంగా ఉండండి.
8గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
9ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
10కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
11పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
12ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
13ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
14బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.

Read ఎఫెసీ పత్రిక 5ఎఫెసీ పత్రిక 5
Compare ఎఫెసీ పత్రిక 5:6-14ఎఫెసీ పత్రిక 5:6-14