Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 7

అపొస్తలుల కార్యములు 7:42-49

Help us?
Click on verse(s) to share them!
42అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా ‘ఇశ్రాయేలీయులారా, నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
43మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’
44మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది.
45మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది.
46దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు.
47కాని సొలొమోను మందిరం కట్టించాడు.
48“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.
49‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది?

Read అపొస్తలుల కార్యములు 7అపొస్తలుల కార్యములు 7
Compare అపొస్తలుల కార్యములు 7:42-49అపొస్తలుల కార్యములు 7:42-49