Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 22

1 రాజులు 22:9-17

Help us?
Click on verse(s) to share them!
9అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక అధికారిని పిలిచి “ఇమ్లా కొడుకు మీకాయాను వెంటనే ఇక్కడికి తీసుకురండి” అని ఆదేశించాడు.
10ఇశ్రాయేలు రాజు అహాబు, యూదారాజు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకుని, సమరయ ముఖద్వారం దగ్గరున్న బహిరంగ స్థలం లో తమ సింహాసనాల మీద కూర్చున్నారు. ప్రవక్తలంతా వారి ఎదుట ప్రవచిస్తూ ఉన్నారు.
11కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు” అన్నాడు.
12ప్రవక్తలంతా అలాగే ప్రవచిస్తూ “యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ వశం చేస్తాడు. కాబట్టి నీవు దాని మీదికి వెళ్లి గెలువు” అన్నారు.
13మీకాయాను పిలవడానికి వెళ్ళిన వార్తాహరుడు అతనితో “ప్రవక్తలంతా ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే మంచి మాటలు చెప్పు” అన్నాడు.
14మీకాయా “యెహోవా జీవం తోడు, యెహోవా నాకు చెప్పిందే నేను చెబుతాను” అన్నాడు.
15అతడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు “మీకాయా, యుద్ధం చేయడానికి మేము రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా వద్దా” అని అడిగాడు. మీకాయా “యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగిస్తాడు, కాబట్టి దాని మీదికి వెళ్లి గెలువు” అని జవాబిచ్చాడు.
16అందుకు రాజు “నీతో ప్రమాణం చేయించి యెహోవా పేరును బట్టి, సత్యమే చెప్పాలని నేనెన్నిసార్లు నీతో చెప్పాలి?” అన్నాడు.
17మీకాయా “ఇశ్రాయేలీయులంతా కాపరిలేని గొర్రెల్లాగా కొండల మీద చెదరి పోవడం నేను చూశాను. వారికి కాపరి లేడు. అందరూ ఎవరింటికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్లిపోవచ్చు అని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు.

Read 1 రాజులు 221 రాజులు 22
Compare 1 రాజులు 22:9-171 రాజులు 22:9-17