1ప్రధాన సంగీతకారుని కోసం, వేణువులతో పాడవలసినది. దావీదు కీర్తన. యెహోవా, నా మొర విను. నా మూలుగుల గురించి ఆలోచించు.
2నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే.
3యెహోవా, ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకుని ఉంటాను.
4నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.
5దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.