Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా - న్యాయా 16

న్యాయా 16:8-13

Help us?
Click on verse(s) to share them!
8ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది.
9ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.
10అప్పుడు దెలీలా “చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు” అని సంసోనుతో అంది.
11సంసోను “కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను” అన్నాడు.
12అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు.
13అప్పుడు దెలీలా “ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు” అంది. అప్పుడు సంసోను “నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గంలో నేతలాగ అల్లితే సరి” అన్నాడు.

Read న్యాయా 16న్యాయా 16
Compare న్యాయా 16:8-13న్యాయా 16:8-13