5లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.
6ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి రాజ్యాలన్నీ ఆయన మహాత్మ్యాన్ని చూస్తాయి.
7చెక్కిన ప్రతిమలను పూజించేవాళ్ళు, పనికిరాని విగ్రహాలను బట్టి గొప్పలు చెప్పుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. అలాటి దేవుళ్ళు అందరూ యెహోవాకు మొక్కండి.
8యెహోవా, సీయోను ఇది విని సంతోషించింది. యూదా పట్టణాలు ఆనందించాయి. నీ నీతికరమైన ఆదేశాలనుబట్టి సంతోషిస్తున్నాయి.
9ఎందుకంటే యెహోవా, నువ్వు ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి. దేవుళ్ళందరిలోకీ నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు.