8నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
9నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.
10వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి.
11నా అడుగులను వాళ్ళు చుట్టుముట్టారు. నన్ను దెబ్బతీసి నేలకూల్చడానికి కనిపెడుతున్నారు.
12వాళ్ళు వేటకు ఆతురతతో ఉన్న సింహంలా ఉన్నారు. చాటైన స్థలాల్లో పొంచి ఉన్న సింహం కూనలాగా ఉన్నారు.
13యెహోవా లేచి రా! వాళ్ళ మీద పడు! వాళ్ళ ముఖాలు నేలకు కొట్టు! నీ ఖడ్గంతో దుర్మార్గులనుంచి నా ప్రాణం రక్షించు.
14నీ చేతితో మనుషుల బారినుండి, యెహోవా, ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుంచి నన్ను రక్షించు. నువ్వు అపురూపంగా ఎంచిన నీ వాళ్ళ కడుపులు నిధులతో నింపుతావు. వాళ్ళు బహుసంతానం కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు సంక్రమింపజేస్తారు.
15నేనైతే న్యాయవంతుడిగా నీ ముఖం చూస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ సుదర్శనం చూసి నేను తృప్తి పొందుతాను.