Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 8

యెహో 8:3-11

Help us?
Click on verse(s) to share them!
3యెహోషువ, హాయి మీదికి వెళ్ళడానికి పరాక్రమవంతులైన ముప్ఫై వేల మంది శూరులను ఏర్పరచుకుని రాత్రివేళ వారిని పంపాడు.
4అతడు వారికిలా ఆజ్ఞాపించాడు. “ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోడానికి మీరు పొంచి ఉండాలి, పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి.
5నేనూ, నాతో కూడా ఉన్న ప్రజలంతా పట్టణానికి చేరుకుంటాం, వారు ఇంతకు ముందులాగా మమ్మల్ని ఎదుర్కోడానికి రాగానే మేము పారిపోతాం.
6ఇంతకు ముందులాగానే ‘వారు మన ముందు నిలవలేక పారిపోతున్నారు’ అనుకుని, వారు మా వెంటబడతారు, పట్టణం నుండి వారు బయటికి రాగానే
7మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి, మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు.
8మీరు ఆ పట్టణాన్ని పట్టుకొన్నప్పుడు యెహోవా మాట ప్రకారం దాన్ని తగలబెట్టాలి. ఇదే నేను మీకాజ్ఞాపిస్తున్నాను.”
9యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు.
10ఉదయమే యెహోషువ లేచి ప్రజలను వ్యూహంగా సమకూర్చి తానూ, ఇశ్రాయేలీయుల పెద్దలూ, ప్రజలకు ముందుగా పడమరగా ఉన్న హాయి మీదికి వెళ్ళారు.
11అతని దగ్గరున్న యోధులందరు ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది.

Read యెహో 8యెహో 8
Compare యెహో 8:3-11యెహో 8:3-11