Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 77

కీర్తన 77:1-11

Help us?
Click on verse(s) to share them!
1ప్రధాన సంగీతకారుని కోసం, యెదూతూను అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన. నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు.
2నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.
3నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సెలా
4నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
5గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,
6ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
7ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా?
8ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?
9దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా
10ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
11అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.

Read కీర్తన 77కీర్తన 77
Compare కీర్తన 77:1-11కీర్తన 77:1-11