Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 55

కీర్తన 55:15-22

Help us?
Click on verse(s) to share them!
15చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది.
16అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
17సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
18నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
19పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.
20నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.
21అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.
22నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

Read కీర్తన 55కీర్తన 55
Compare కీర్తన 55:15-22కీర్తన 55:15-22