Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 35

కీర్తన 35:14-27

Help us?
Click on verse(s) to share them!
14అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.
15కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు.
16గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.
17ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు.
18అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.
19నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.
20వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.
21నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
22యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు.
23నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు.
24యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు.
25వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం, అని చెప్పనివ్వకు.
26వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!
27నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక!

Read కీర్తన 35కీర్తన 35
Compare కీర్తన 35:14-27కీర్తన 35:14-27