1దావీదు కీర్తన యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి.
2నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.
3నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.