Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సామెత - సామెత 18

సామెత 18:16-23

Help us?
Click on verse(s) to share them!
16ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.
17వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.
18చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.
19పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.
20ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.
21జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.
22భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
23నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.

Read సామెత 18సామెత 18
Compare సామెత 18:16-23సామెత 18:16-23