Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - న్యాయా - న్యాయా 20

న్యాయా 20:15-27

Help us?
Click on verse(s) to share them!
15ఆ రోజు బెన్యామీను గోత్రం వాళ్ళు తమ సంఖ్య ఎంతో లెక్క వేసుకున్నారు. గిబియా వాళ్ళు ఏడువందల మంది కాకుండా ఇతర పట్టణాలనుండి వచ్చినవాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు.
16వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఏడు వందలమంది ఎడమ చేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక ఒడిసెలలో రాయి పెట్టి తలవెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం గలవారు.
17బెన్యామీనీయులు కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయుల్లో కత్తియుద్ధం చేయగలిగిన వాళ్ళు నాలుగు లక్షలమంది అని లెక్క వేశారు. వీళ్ళంతా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు.
18ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు “యూదా వాళ్ళు వెళ్ళాలి” అని చెప్పాడు.
19ఇక ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి యుద్ధానికి సిద్ధపడి గిబియాకు ఎదురుగా మొహరించారు.
20ఇశ్రాయేలీయుల సైనికులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళి గిబియా మీద దాడి చేయడానికి బారులు తీరారు.
21ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు.
22తరువాత ఇశ్రాయేలీయులు వెళ్ళి సాయంకాలం వరకూ యెహోవా ఎదుట ఏడుస్తూ ఉన్నారు. “మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళాలా” అంటూ దేవుని నడిపింపు కోసం ప్రార్థించారు. అప్పుడు యెహోవా “యుద్ధానికి వెళ్ళండి” అని చెప్పాడు.
23రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.
24కాబట్టి ఇశ్రాయేలీయులు రెండో రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి బయల్దేరారు. వారిని ఎదుర్కోడానికి బెన్యామీనీయులు
25గిబియాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయుల్లో పద్దెనిమిది వేలమందిని చంపేశారు.
26చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధం చేసేవాళ్ళే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులూ, ప్రజలూ అంతా వెళ్ళి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకూ యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి, దేవునికి దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.
27ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.

Read న్యాయా 20న్యాయా 20
Compare న్యాయా 20:15-27న్యాయా 20:15-27