Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 71

కీర్తన 71:6-15

Help us?
Click on verse(s) to share them!
6నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.
7నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.
8నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.
9ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.
10నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు.
11దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.
12దేవా, నాకు దూరంగా ఉండవద్దు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా బయలుదేరు.
13నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.
14నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.
15నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.

Read కీర్తన 71కీర్తన 71
Compare కీర్తన 71:6-15కీర్తన 71:6-15