Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 68

కీర్తన 68:19-30

Help us?
Click on verse(s) to share them!
19ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
20మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
21దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
22ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
23నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
24దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
25చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
26సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
27మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
28నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
29యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
30జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.

Read కీర్తన 68కీర్తన 68
Compare కీర్తన 68:19-30కీర్తన 68:19-30