33నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి.
34నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.
35నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది.