12విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.
13సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
14వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?
15తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.
16ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.
17వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.
18చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.