Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 19

యెహో 19:24-35

Help us?
Click on verse(s) to share them!
24అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.
25వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,
26అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి
27తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ
28ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది.
29అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది.
30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.
31వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
32ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.
33వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది.
34అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.
35ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,

Read యెహో 19యెహో 19
Compare యెహో 19:24-35యెహో 19:24-35