Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - పరమ - పరమ 7

పరమ 7:9-12

Help us?
Click on verse(s) to share them!
9నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.
10(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.
11ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.
12పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో, వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద. అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను.

Read పరమ 7పరమ 7
Compare పరమ 7:9-12పరమ 7:9-12