11చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
12దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
13అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
14బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
15(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
16(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
17(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.