21కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు.
22అలాటి వారికి హఠాత్తుగా ఆపద వాటిల్లుతుంది. వారి కాలం ఎప్పుడు ముగిసి పోతుందో ఎవరికి తెలుసు?
23ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు.
24నీలో దోషం లేదని దుష్టుడితో చెప్పే వాణ్ణి మనుషులు శపిస్తారు. జనం అలాటి వాణ్ణి అసహ్యించుకుంటారు.