11అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది.
12న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు.
13దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.
14చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.