Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 13

లేవీ 13:45-58

Help us?
Click on verse(s) to share them!
45ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని ‘అశుద్ధుణ్ణి! అశుద్ధుణ్ణి!’ అని కేకలు పెట్టాలి.
46ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి.
47ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా నార బట్టలైనా,
48లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా
49వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి, వ్యాపిస్తే అది బూజు, తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి.
50యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని ఏడురోజుల పాటు వేరుగా ఉంచాలి.
51ఏడో రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కన్పిస్తే అది హానికరమైన తెగులు. అది అశుద్ధం.
52కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి.
53అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో, తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపొతే
54యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి.
55ఆ తరువాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా, ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి.
56ఒకవేళ ఆ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి.
57ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి.
58నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే ఆ వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది.

Read లేవీ 13లేవీ 13
Compare లేవీ 13:45-58లేవీ 13:45-58