Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యెహో - యెహో 18

యెహో 18:12-21

Help us?
Click on verse(s) to share them!
12ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు యెరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బేతావెను అరణ్యం దగ్గర అంతం అయింది.
13అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్‌ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకూ వెళ్ళింది.
14అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బేత్‌హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనే కిర్యత్యారీము వరకూ వెళ్ళింది, అది పడమటి సరిహద్దు.
15దక్షిణం వైపు కిర్యత్యారీము కొననుండి దాని సరిహద్దు పడమరగా నెఫ్తోయ నీళ్ల ఊటవరకూ సాగి
16ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్‌ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్‌హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్‌రోగేలు వరకూ వెళ్ళింది.
17అది ఉత్తరంగా ఏన్‌షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.
18అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బేత్‌హోగ్లా వరకూ వెళ్ళింది.
19అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయింది. ఇది దక్షిణ సరిహద్దు.
20తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది.
21బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో, బేత్‌హోగ్లా, యెమెక్కెసీసు,

Read యెహో 18యెహో 18
Compare యెహో 18:12-21యెహో 18:12-21