Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 25

లేవీ 25:43-55

Help us?
Click on verse(s) to share them!
43నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు.
44మీ చుట్టుపక్కల ఉన్న జాతుల్లోనించి దాస దాసీలను కొనుక్కోవచ్చు.
45మీ మధ్య నివసించే పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన పరాయి వారిని కొనవచ్చు. వారు మీ ఆస్తి అవుతారు.
46అలాటి బానిసలను మీ తరవాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలౌతారు. కానీ మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు.
47పరదేశిగానీ మీ దగ్గర తాత్కాలికంగా నివసించేవాడు గాని ధనికుడై, నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు పేదవాడై ఆ పరదేశికైనా ఆ పరదేశి కుటుంబంలో ఎవరికైనా తనను అమ్ముకున్నాడనుకోండి.
48నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు అమ్ముడుబోయిన తరువాత అతణ్ణి విడిపించ వచ్చు. అతడి బంధువుల్లో ఎవరైనా అతణ్ణి విడిపించవచ్చు.
49అతని బాబాయిగాని బాబాయి కొడుకు గాని అతని వంశంలోని రక్తసంబంధిగాని అతణ్ణి విడిపించవచ్చు. అవసరమైన విడుదల వెల అతనికి దొరికితే అతడు తనను తాను విడిపించుకోవచ్చు.
50అప్పుడు అతడు తనను కొనుక్కున్న వాడితో బేరమాడాలి. తాను అమ్ముడుబోయిన సంవత్సరం నుండి సునాద సంవత్సరం వరకూ సంవత్సరాలు లెక్క బెట్టాలి. తనను కొనుక్కున్న వాడి దగ్గర ఎంతకాలం పనిచేశాడు అనే దాన్ని బట్టి అతని విడుదల వెల లెక్కగట్టాలి. ఆ వెలను జీతానికి పెట్టుకున్న సేవకునికి ఇచ్చే దాని ప్రకారం లెక్కించాలి.
51సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, ఆ సంవత్సరాల లెక్క ప్రకారం తన విడుదల వెల తిరిగి చెల్లించాలి.
52సునాద సంవత్సరానికి ఇక కొద్ది కాలమే ఉంటే కొన్న వాడితో లెక్క చూసుకుని మిగిలిన సంవత్సరాల లెక్కచొప్పున చెల్లించాలి.
53సంవత్సరాల లెక్క ప్రకారం జీతంపై పని చేసే వాడి లాగా వాడతని దగ్గర పని చెయ్యాలి. అతని చేత కఠినంగా సేవ చేయించకుండా మీరు చూసుకుంటూ ఉండాలి.
54అతడు ఈ విధంగా విడుదల పొందకపోతే సునాద సంవత్సరంలో అతడు తన పిల్లలతో సహా విడుదల పొందుతాడు.
55ఎందుకంటే ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నేను ఐగుప్తుదేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడైన యెహోవాను.”

Read లేవీ 25లేవీ 25
Compare లేవీ 25:43-55లేవీ 25:43-55