Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - లేవీ - లేవీ 18

లేవీ 18:22-28

Help us?
Click on verse(s) to share them!
22స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.
23ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.
24వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.
25ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.
26కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా
27మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.
28నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.

Read లేవీ 18లేవీ 18
Compare లేవీ 18:22-28లేవీ 18:22-28