Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ప్రసంగి - ప్రసంగి 9

ప్రసంగి 9:4-12

Help us?
Click on verse(s) to share them!
4చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
5బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
6వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి. సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.
7నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
8ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో.
9దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం.
10నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.
11నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
12తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.

Read ప్రసంగి 9ప్రసంగి 9
Compare ప్రసంగి 9:4-12ప్రసంగి 9:4-12