6ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
8ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
9సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
10దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే.