Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ప్రసంగి - ప్రసంగి 8

ప్రసంగి 8:2-7

Help us?
Click on verse(s) to share them!
2నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.
3రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు.
4రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
5రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
6ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?

Read ప్రసంగి 8ప్రసంగి 8
Compare ప్రసంగి 8:2-7ప్రసంగి 8:2-7