5రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను.
6ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం.
7సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది.
8గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.
9రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.
10ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది.
11పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.
12జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.
13వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, వెర్రితనంతో ముగుస్తాయి.
14ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?