Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 18

అపొస్తలుల కార్యములు 18:11-22

Help us?
Click on verse(s) to share them!
11అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.
12గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు.
13“వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు” అని ఆరోపణ చేశారు.
14పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, “యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే.
15ఇది ఏదో ఉపదేశం గురించో, పేరుల గురించో, మీ ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు” అని యూదులతో చెప్పి
16వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు.
17అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
18పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.
19వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
20వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
21అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
22తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.

Read అపొస్తలుల కార్యములు 18అపొస్తలుల కార్యములు 18
Compare అపొస్తలుల కార్యములు 18:11-22అపొస్తలుల కార్యములు 18:11-22