Text copied!
Bibles in Telugu

సామెత 20:9-14 in Telugu

Help us?

సామెత 20:9-14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?
10 వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
11 చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు.
12 వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
13 అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
14 కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
సామెత 20 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019