Text copied!
Bibles in Telugu

సంఖ్యా 26:9-51 in Telugu

Help us?

సంఖ్యా 26:9-51 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10 ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11 అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12 షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13 జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14 ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15 గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
16 ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
17 ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
18 వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
19 యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
20 యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
21 పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
22 వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
23 ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
24 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
25 జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26 ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
27 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
28 యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
29 మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
30 ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
31 అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
32 షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
33 హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
34 వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.
35 ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
36 షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
37 వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
38 బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
39 అహీరామీయులు అహీరాము వంశస్థులు,
40 షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
41 వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.
42 దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
43 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.
44 ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
45 బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
46 ఆషేరు కూతురు పేరు శెరహు.
47 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
48 నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
49 యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.
51 ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
సంఖ్యా 26 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019