Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సంఖ్యా - సంఖ్యా 26

సంఖ్యా 26:9-51

Help us?
Click on verse(s) to share them!
9కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
16ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
17ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
18వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
19యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
20యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
21పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
22వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
23ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
24రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
25జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
27రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
28యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
29మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
30ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
31అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
32షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
33హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
34వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.
35ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
36షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
37వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
38బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
39అహీరామీయులు అహీరాము వంశస్థులు,
40షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
41వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.
42దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
43రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.
44ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
45బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
46ఆషేరు కూతురు పేరు శెరహు.
47రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
48నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
49యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
50వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.
51ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.

Read సంఖ్యా 26సంఖ్యా 26
Compare సంఖ్యా 26:9-51సంఖ్యా 26:9-51