Text copied!
Bibles in Telugu

న్యాయా 1:15-20 in Telugu

Help us?

న్యాయా 1:15-20 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అందుకు ఆమె “నాకు దీవెన ఇవ్వు. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు” అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు.
16 మోషే మామ అయిన కేయిను వారసులు యూదావంశం వారితో కలిసి ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి అరాదుకు దక్షిణంవైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు.
17 యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి, ఆ పట్టణానికి హోర్మా అనే పేరు పెట్టారు.
18 యూదావంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అష్కెలోనును దాని ప్రాంతాన్ని, ఎక్రోనును దాని ప్రాంతాన్ని ఆక్రమించారు.
19 యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు.
20 మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
న్యాయా 1 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019