Text copied!
Bibles in Telugu

1 రాజులు 8:14-17 in Telugu

Help us?

1 రాజులు 8:14-17 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 తరవాత అతడు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలబడి ఉండగా వారిని ఈ విధంగా దీవించాడు,
15 “నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక.
16 ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుండి నా నామం నిలిచి ఉండేలా ఇశ్రాయేలీయుల గోత్రాలకు చెందిన ఏ పట్టణంలో నైనా మందిరం కట్టించాలని నేను కోరలేదు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజ్యపాలన చేయడానికి దావీదును ఎన్నుకున్నాను’ అని ఆయన ప్రకటించాడు.
17 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలని నా తండ్రి అయిన దావీదు కోరుకున్నాడు.
1 రాజులు 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019