Text copied!
Bibles in Telugu

సంఖ్యా 26:3-15 in Telugu

Help us?

సంఖ్యా 26:3-15 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
4 “20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.
5 ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
6 పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
7 వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.
8 పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
9 కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10 ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11 అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12 షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13 జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14 ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15 గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
సంఖ్యా 26 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019