Text copied!
Bibles in Telugu

లేవీ 18:11-19 in Telugu

Help us?

లేవీ 18:11-19 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
12 నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
13 నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.
14 నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.
15 నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
16 నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.
17 ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.
18 నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.
19 ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
లేవీ 18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019