Text copied!
Bibles in Telugu

రోమీయులకు రాసిన పత్రిక 3:7-18 in Telugu

Help us?

రోమీయులకు రాసిన పత్రిక 3:7-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
8 మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.
9 అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది.
14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
15 రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.
16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
17 వారికి శాంతిమార్గం తెలియదు.
18 వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
రోమీయులకు రాసిన పత్రిక 3 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019