Text copied!
Bibles in Telugu

యెహో 9:14-23 in Telugu

Help us?

యెహో 9:14-23 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.
15 యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
16 అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.
17 ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.
18 ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.
19 దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. “మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.
20 మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి” అని చెప్పారు.
21 నాయకులు “వారిని బతకనియ్యండి” అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.
22 యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. “మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?
23 ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు.
యెహో 9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019