Text copied!
Bibles in Telugu

యెహో 8:19-23 in Telugu

Help us?

యెహో 8:19-23 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటు వేసిన చోటనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోకి చొచ్చుకుపోయి దాన్ని పట్టుకుని వెంటనే అప్పటికప్పుడే తగులబెట్టేశారు.
20 హాయివారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ పట్టణం పొగ ఆకాశానికి ఎక్కుతూ ఉంది. అప్పుడు అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు యోధులు వెనక్కి తిరిగి తమను తరుముతున్న వారిమీద దాడిచేసేటప్పటికి ఈ వైపు గానీ, ఆ వైపు గానీ, ఎటూ పారిపోవడానికి వారికి వీలు లేకపోయింది.
21 పొంచి ఉన్నవారు పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణంలో పొగ పైకి రావడం యెహోషువ, ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వారు హాయి వారిని హతం చేశారు.
22 తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయివారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు.
23 వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
యెహో 8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019