Text copied!
Bibles in Telugu

యెహో 21:26-44 in Telugu

Help us?

యెహో 21:26-44 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 వాటి పచ్చిక మైదానాలు గాక కహాతు సంబంధుల్లో మిగిలినవారికి వచ్చిన పట్టణాలన్నీ పది.
27 లేవీయుల వంశాల్లో గెర్షోనీయులకు రెండు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న బాషానులోని గోలాను, దాని పచ్చిక మైదానాలనూ బెయెష్టెరా, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
28 ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ
29 ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
30 ఆషేరు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే మిషెయలు, దాని పచ్చిక మైదానాలనూ అబ్దోను, దాని పచ్చిక మైదానాలనూ
31 హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
32 నఫ్తాలి గోత్రం నుండి మూడు పట్టణాలను, అంటే అనాలోచితంగా హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గలిలయలోని కెదెషు, దాని పచ్చిక మైదానాలనూ హమ్మోత్దోరు, దాని పచ్చిక మైదానాలనూ కర్తాను, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
33 వారి వంశాల ప్రకారం గెర్షోనీయుల పట్టణాలన్నీ వాటి పచ్చిక మైదానాలు కలుపుకుని పదమూడు పట్టణాలు.
34 లేవీయుల్లో మిగిలిన మెరారీయుల వంశాలకు జెబూలూను గోత్రాల నుండి నాలుగు పట్టణాలను, అంటే యొక్నెయాము, దాని పచ్చిక మైదానాలనూ
35 కర్తా, దాని పచ్చిక మైదానాలనూ దిమ్నా, దాని పచ్చిక మైదానాలనూ నహలాలు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
36 రూబేను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే బేసెరు, దాని పచ్చిక మైదానాలనూ యాహసు, దాని పచ్చిక మైదానాలనూ
37 కెదెమోతు, దాని పచ్చిక మైదానాలనూ మేఫాతు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
38 గాదు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న గిలాదులోని రామోతు, దాని పచ్చిక మైదానాలనూ మహనయీము, దాని పచ్చిక మైదానాలనూ
39 హెష్బోను, దాని పచ్చిక మైదానాలనూ యాజెరు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
40 వారి వారి వంశాల ప్రకారం, అంటే లేవీయుల మిగిలిన వంశాల ప్రకారం అవన్నీ మెరారీయులకు వచ్చిన పట్టణాలు. చీటి ద్వారా వారికి వచ్చిన పట్టణాలు పన్నెండు.
41 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
42 ఆ పట్టణాలన్నింటికీ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.
43 యెహోవా ప్రమాణం చేసి ఇశ్రాయేలీయుల పూర్వీకులకిస్తానని చెప్పిన దేశమంతా ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. వాళ్ళు దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించారు.
44 యెహోవా వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్నివైపులా వారికి విశ్రాంతి కలగచేశాడు. యెహోవా వారి శత్రువులందరిని వారికి అప్పగించాడు కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేకపోయారు.
యెహో 21 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019