Text copied!
Bibles in Telugu

యెహో 10:15-26 in Telugu

Help us?

యెహో 10:15-26 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
16 ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
17 మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
18 యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
19 మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
20 వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
21 ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
22 యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
23 వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
24 వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
25 అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
26 తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
యెహో 10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019