Text copied!
Bibles in Telugu

ప్రసంగి 5:14-18 in Telugu

Help us?

ప్రసంగి 5:14-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు.
15 వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు. తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు.
16 ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి?
17 ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.
18 నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది.
ప్రసంగి 5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019