3 ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. బలంగా ఉండేవారు వంగిపోతారు. తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు.
4 తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. వీధి తలుపులు మూసేస్తారు. పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి.
5 ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, సహజమైన కోరికలు అంతరిస్తాయి. అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు.
6 వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.
7 మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.
8 ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.”