Text copied!
Bibles in Telugu

ప్రసంగి 10:7-17 in Telugu

Help us?

ప్రసంగి 10:7-17 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది.
8 గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.
9 రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.
10 ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది.
11 పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.
12 జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.
13 వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, వెర్రితనంతో ముగుస్తాయి.
14 ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?
15 మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు.
16 ఒక దేశానికి బాలుడు రాజుగా ఉండడం, ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం.
17 అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం.
ప్రసంగి 10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019