Text copied!
Bibles in Telugu

పరమ 4:11-14 in Telugu

Help us?

పరమ 4:11-14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 వధూ! నీ పెదాలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక కింద తేనె, పాలు తొణికిసలాడుతున్నాయి. నీ వస్త్రాల సువాసన లెబానోను సువాసనలాగా ఉంది.
12 నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.
13 నీ కొమ్మలు దానిమ్మతోటలా ఉన్నాయి. దానిలో రక రకాల పళ్ళ చెట్లున్నాయి. గోరింటాకు, జటామాంసి,
14 కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి. బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.
పరమ 4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019