Text copied!
Bibles in Telugu

న్యాయా 20:30-44 in Telugu

Help us?

న్యాయా 20:30-44 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 మూడో రోజున ఇంతకు ముందు లాగానే ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళారు. గిబియా వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు.
31 బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణంలో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్ళారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డవాళ్ళను రాజ మార్గాల్లో చంపుతూ వెళ్ళారు. దాదాపు ముప్ఫై మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది. మరొకటి గిబియాకు వెళ్తుంది.
32 బెన్యామీనీయులు “ఇంతకు ముందులా వీళ్ళు మనముందు నిలువలేకపోతున్నారు” అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు “మనం పారిపోతూ వాళ్ళను పట్టణంలోనుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
33 ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.
34 అప్పుడు ఇశ్రాయేలీ సైనికుల్లో నుండి ప్రత్యేకంగా ఉన్న పదివేల మంది సైనికులు గిబియా నుండి రావడంతో భీకరమైన యుద్ధం జరిగింది. కాని తాము నాశనం అంచున ఉన్నామని బెన్యామీనీయులకు తెలియలేదు.
35 ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల ద్వారా బెన్యామీనీయులను ఓడించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్లో ఇరవై ఐదు వేల వంద మందిని చంపారు. వీళ్ళంతా కత్తియుద్ధం చేయడంలో శిక్షణ పొందినవాళ్ళు.
36 బెన్యామీను సైన్యం తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీ సైనికులు తాము గిబియా పైన మాటుగా పెట్టిన వారిపై నమ్మకముంచి బెన్యామీనీయులను తమపైకి రానిచ్చారు.
37 మాటుగా ఉన్న సైనికులు త్వరగా గిబియాలో చొరబడి పట్టణంలో ఉన్నవారినందరినీ కత్తితో చంపేశారు.
38 ఇశ్రాయేలు సైన్యాలకూ, మాటున ఉండేవారికీ మధ్య సంకేతం ఒకటుంది. అదేమిటంటే పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయడం.
39 ఇశ్రాయేలీయులు మొదట యుద్ధం నుండి పారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు బెన్యామీనీయులు “వీళ్ళు మొదటి యుద్ధంలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా మన చేతిలో ఓడిపోతున్నారు” అనుకుని, ఇశ్రాయేలీయుల్లో దాదాపు ముప్ఫైమందిని చంపారు.
40 కాని వెనుక ఉన్న పట్టణంలో నుండి ఆకాశంలోకి పెద్ద స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభించింది. అప్పుడు బెన్యామీనీ యులు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ పట్టణమంతా పొగ నిండిపోయి కనిపించింది.
41 అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగారు. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని భయకంపితులయ్యారు.
42 ఇశ్రాయేలీయుల నుండి పారిపోవడానికి ఎడారి దారి వైపుకు వెళ్దామని చూశారు, కానీ పారిపోతుండగా వారిని పట్టణంలో నుండి వచ్చిన ఇశ్రాయేలీ సైనికులు దారిలోనే చంపారు.
43 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుముట్టారు. వారి వెనకబడి తరిమారు. తూర్పు వైపున గిబియాకి ఎదురుగా నోహా దగ్గర వారిని అణచి వేశారు.
44 అక్కడ బెన్యామీనీయుల్లో పద్దెనిమిది వేలమంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు.
న్యాయా 20 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019