Text copied!
Bibles in Telugu

కీర్తన 5:2-9 in Telugu

Help us?

కీర్తన 5:2-9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే.
3 యెహోవా, ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకుని ఉంటాను.
4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.
5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.
6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.
7 నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను.
8 యెహోవా, నా శత్రువులను బట్టి నీ నీతి మార్గంలో నన్ను నడిపించు. నా ఎదుట నీ మార్గం తిన్నగా చెయ్యి.
9 వాళ్ళ నోట సత్యం లేదు. వాళ్ళ అంతరంగం దుర్మార్గం. వాళ్ళ కంఠం తెరిచిన సమాధి. వాళ్ళు తమ నాలుకతో ఇచ్చకాలు పలుకుతారు.
కీర్తన 5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019